రెండు పెద్ద డీల్స్ సైన్ చేసిన 18 ఏళ్ల హీరోయిన్

* 18 ఏళ్లకే భారీ ఆఫర్ అందుకున్న హీరోయిన్

Dhatripriya
Updated on: 6 Feb 2023 6:00 AM IST
Anikha Surendran Signed Two Big Deals
X

రెండు పెద్ద డీల్స్ సైన్ చేసిన 18 ఏళ్ల హీరోయిన్

Anikha Surendran: టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనికా సురేంద్రన్ కి నాగార్జున ఘోస్ట్ సినిమాలో టీనేజర్ గా కనిపించింది. తాజాగా ఇప్పుడు బుట్ట బొమ్మ సినిమాతో హీరోయిన్గా కూడా మరి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అనికా సురేంద్రన్. టీజర్ మరియు ట్రైలర్ తోనే బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఈ వారం థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

"కప్పెలా"సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన అనికా సురేంద్రన్ కి 18 ఏళ్ళే. ఈ సినిమాతో బాగా ఆకట్టుకున్న అనికా సురేంద్రన్ కు ఇప్పుడు టాలీవుడ్ నుంచి బోలెడు భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో రెండు పెద్ద బానర్లు ఈమెతో కొన్ని డీల్స్ కూడా సైన్ చేసినట్లు తెలుస్తోందది. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు చేయబోతున్న సినిమాలలో అనికా సురేంద్రన్ హీరోయిన్గా కాంట్రాక్ట్ సైన్ చేసింది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ల కంటే యువ హీరోయిన్లు ఎక్కువ ఆఫర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే.

ఒక్క సినిమా సూపర్ హిట్ అయిపోగానే వారిపై బోలెడంత క్రేజ్ కూడా పెరిగిపోతుంది. దీంతో వారిపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. కృతి శెట్టి, శ్రీ లీల వంటి హీరోయిన్ల లాగా ఇప్పుడు అనికా సురేంద్రన్ కు కూడా ఒకదాని తర్వాత మరొకటి భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. మరి ఈ ఆఫర్లను ఆమె ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story