Anee Master: మెగా వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్..

Anee Master: రామ్ చరణ్ కి కృతజ్ఞతలు చెబుతున్న యానీ మాస్టర్

admin1
Updated on: 7 Dec 2021 5:57 PM IST
Anee Master at Ramcharan Sister-In-Law
X

Anee Master: మెగా వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్..

Anee Master - Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు అంటే ఉపాసన కొణిదెల సొంత చెల్లెలు అనుష్పలా కామినేని త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. అపోలో గ్రూప్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అనుష్పలా ఈ మధ్యనే అర్మాన్ ఇబ్రహీం అనే ఒక కార్ రేసర్ తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వారి సంగీత్ వేడుక నుంచి ఉపాసన, రామ్ చరణ్, ఆర్మాన్ మరియు అనుష్పలా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సంగీత వేడుక నుంచి వైరల్ అవుతున్న మరొక ఫోటో కూడా ఉంది. అందులో రామ్ చరణ్ తో పాటు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 5 తో మంచి పేరు సంపాదించిన యాని మాస్టర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో వారికీ డాన్స్ కొరియోగ్రఫీ చేసింది అనుష్పలా మాస్టరే. ఈమధ్యనే మహేష్ బాబు కూతురు సితార కి డాన్స్ నేర్పిస్తూ కనిపించిన యాని మాస్టర్ ఇప్పుడు కామినేని కుటుంబ వేడుకల్లో కూడా కనిపించారు. గతంలో కూడా చిరంజీవి వాళ్ళ ఇంట్లో జరిగిన కొన్ని వేడుకలకి యాని మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ నేపథ్యంలో మరొకసారి తమ ఇంట్లో వేడుకకి తనని పిలిచినందుకు యాని మాస్టర్ రామ్ చరణ్ కి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు యాని మాస్టర్.

admin1

admin1

Next Story