బిగ్ బాస్ 3 లో యాంకర్ ఉదయ భాను.. భారీ పారితోషికం..?

Ruthvik
Updated on: 24 April 2019 11:50 AM IST
బిగ్ బాస్ 3 లో యాంకర్ ఉదయ భాను.. భారీ పారితోషికం..?
X

బిగ్ బాస్ రెండో సీజన్ విజయవంతంగా ముగిసిన తర్వాత మూడో సీజన్ కి సంబందించిన చర్చ చాలానే జరిగింది. అయితే ఈ మూడే సీజన్ ని ఎవరు హోస్ట్ చేస్తారు, ఎవరెవరు పాల్గొంటారు అనే విషయం పైన మాత్రం క్లారిటీ రాలేదు. ఒక దశ లో తిరిగి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా కంబాక్ చేయాలని చూసినా అది వర్క్ అవుట్ కాలేదు. తర్వాత నాగార్జున దగ్గరకు వెళ్లారు నిర్వాహకులు. ఇప్పటికి అయితే ఈ రెండో సీజన్ లో ఎవరు ఉంటారు అనే విషయం మీద ఇంకా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉదయ భాను యాంకర్ గా అందరికీ సుపరిచితురాలే. అయితే ఆవిడ ని ఈ సారి కంటెస్టెంట్ గా తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు అని తెలుస్తుంది. అదే విషయమై ఆవిడని సంప్రదించగా ఉదయ భాను దాదాపు రోజుకి రెండు లక్షల రూపాయలు పారితోషికం ఆశించిందట. ఇది విన్న నిర్వాహకులు మొదట షాక్ కి గురయ్యారు. అయితే ఉదయ భాను ని వదులుకోవడం ఇష్టం లేని బిగ్ బాస్ నిర్వాహకులు ఇంకా ఆవిడ తో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. మరి కొద్దీ రోజులు ఖచ్చితమైన వివరాలు వెల్లడి ఆయె అవకాశం ఉంది.

Ruthvik

Ruthvik

Next Story