కేటీఆర్ ని కలిసిన యాంకర్ సుమ!

కేటీఆర్ ని కలిసిన యాంకర్ సుమ!
x
Highlights

బుల్లితెర పైన యాంకర్ గా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది సుమ. సుమ తర్వాత ఎంతమంది యాంకర్స్ వచ్చినప్పటికీ సుమను మాత్రం ఎవ్వరు కూడా బీట్ చేయలేకపోతున్నారు

బుల్లితెర పైన యాంకర్ గా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది సుమ. సుమ తర్వాత ఎంతమంది యాంకర్స్ వచ్చినప్పటికీ సుమను మాత్రం ఎవ్వరు కూడా బీట్ చేయలేకపోతున్నారు. సినిమాలు, షోలు, ఆడియో రిలీజ్‌, ఈవెంట్స్ ఇలా ప్రతిదాంట్లో సుమ రాణిస్తూ వస్తుంది. తాజాగా సుమక్క పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను కూడా స్టార్ట్ చేసింది సుమ.

ఇక ఇదిలా ఉంటే తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఅర్ ని కలిసింది సుమ. ఈ విషయాన్నీ సుమనే స్వయంగా వెల్లడించింది. 'మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా నా షోలలో నాన్‌స్టాప్‌గా ఎదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాను. కానీ నాయకత్వ హోదాలో మీరు మాట్లాడే విధానం వినడానికి ఎంతో విలువైనదిగా ఉంటుంది. నిబద్దత, మాట్లాడే విధానం అద్భుతం' అంటూ కేటీఅర్ ను పొగడ్తలతో ముంచెత్తింది సుమ. అయితే సుమ ఎందుకు కేటీఅర్ ను మీట్ అయ్యారనే దానిపైన ఎలాంటి క్లారిటీ లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories