Suma Kanakala: మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టబోతున్న స్టార్ యాంకర్

* సినిమాలోకి వెళ్ళబోతున్న సుమ కనకాల

admin1
Updated on: 3 Nov 2021 12:03 PM IST
Anchor Suma Kanakala Re-entry in Movies
X

సుమ కనకాల(ట్విట్టర్ ఫోటో)

Suma Kanakala: ప్రముఖ టీవీ యాంకర్ గా బుల్లితెర పై రాణిస్తున్నా సుమ కనకాల యాంకర్ గా మారే ముందు నటిగా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 1996లో "కళ్యాణ ప్రాప్తిరస్తు" అనే ఒక సినిమాలో సుమ హీరోయిన్ గా నటించింది. అయితే ఆ తర్వాత మాత్రం టీవీ హోస్ట్ గా సుమా బిజీ అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఆమె వెండితెరపై కనిపించింది తక్కువే. అప్పుడప్పుడు క్యామియో పాత్రల్లో కనిపించిన సుమా ఈ మధ్యనే సమంత హీరోయిన్ గా నటించిన "ఓ బేబీ" సినిమాలో కూడా ఒక చిన్న పాత్రను పోషించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మళ్లీ సుమ సినిమాల్లో అడుగుపెట్టబోతోంది.

తాజాగా సుమ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో సుమని చాలామంది సినిమా చేస్తున్నారా, సినిమా చూస్తున్నారా అంటూ ప్రశ్నలు అడుగుతారు. దీంతో కన్ఫ్యూజ్ అయిన సుమ ఇంత మంది అడుగుతున్నారు కాబట్టి పోనీ చేసేస్తే పోలా అని ఇండైరెక్ట్ గా తను సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు హింట్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ వీడియో ద్వారా త్వరలోనే ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలను విడుదల చేస్తామని కూడా ప్రకటించేసింది సుమ. చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సుమను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

admin1

admin1

Next Story