Anchor Suma: నెటిజన్ల ట్రోల్స్.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన సుమ

Anchor Suma: సుమ చేసిన పనికి నెటింట్టో ట్రోల్స్ మొదలైయ్యాయి. నెటిజన్లు నోరు ముయించారు సుమ.

Samba Siva Rao
Updated on: 1 May 2021 6:07 PM IST
Anchor Suma: Anchor Suma Kanakala Answer To Negative Comments On Calf Video
X

సుమ ఫైల్ ఫోటో 

Anchor Suma: యాంకర్ సుమ కనకాల అంటే ఎంతో మందికి అభిమానం. ఆమెను తమ కుటుబంలోని వ్యక్తిలా భావిస్తారు. బుల్లితెరలో ఆమె పొగ్రాం వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రస్తుతం సుమకి మూవీ ఫంక్షన్లు ఏవీ లేకపోయినా..బుల్లితెరపై షోలతో బీజీగా గడుపుతున్నారు. అంతే కాదు సోషల్ మీడియాతోను యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబందించిన అన్ని విషయాలు అభిమానులతో ముచ్చటిస్తారు. సుమ సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మరింది.

సుమ పెట్టిన పోస్ట్ ద్వారా నెటిజ‌న్ల ట్రోల్స్‌కు గుర‌యిన సంగతి తెలిసిందే. లేగ దూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి కట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారేంటి? ఇంతటి క్రూరత్వమా అంటూ సుమను తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో వర్గం మాత్రం సుమను సపోర్ట్‌ చేస్తూ అండగా నిలిచారు. నెటిజ‌న్ల ట్రోల్స్‌కు సుమ బదులిచ్చింది.

ఈ సుమ పోస్ట్ చేస్తూ.. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని చెప్పుకొచ్చింది. సుమ చెప్పిన దానికి నెటిజన్లు అగీకరించలేదు. ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. దీంతో లేగ దూడ వ్యక్తి దగ్గరకు వెళ్లి రాముడి(లేగ దూడ)మూతికి మొన్న చిక్కం (వెదురు బుట్టి) ఎందుకు కట్టారు? అని సుమ అడగ్గా.. అది మట్టిని తినకుండా ఉండేందుకు అలా కట్టాను అని అతను సమాధానమిచ్చాడు. గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని, ఆవు అంటే శుభం అనే ఉద్దేశంతో ఆవును పెంచుకుంటున్నామనే తప్పా వ్యాపారం కోసం కాదు అని పేర్కొన్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story