కొత్త కారు వల్ల ఇబ్బందుల్లో పడ్డ రష్మీ

Ruthvik
Published on: 18 March 2019 11:17 AM IST
కొత్త కారు వల్ల ఇబ్బందుల్లో పడ్డ రష్మీ
X

ఒకవైపు టీవీ షోలతో మరొకవైపు సినిమాలతో నిమిషం తీరిక లేకుండా ఉంది జబర్దస్త్ యాంకర్ రష్మీ. అయితే వర్క్ పరంగా రష్మీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుందని ఈ మధ్యనే ఒక కారు కొనుక్కుందట. కానీ ఆ కొత్త కారు ఇప్పుడు రష్మిని ఇబ్బందుల్లో పడేలా చేసింది. తాజా సమాచారం ప్రకారం రష్మీ కొత్త కారు యాక్సిడెంట్ కి గురైంది. అర్ధరాత్రి పూట హై స్పీడ్ లో వెళ్తున్న ఆ కారు ఒక పాదచారి ని గుద్దేసింది.

వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు అర్ధరాత్రి విశాఖపట్నం గాజువాక లోని కూర్మన్నపాలెం లో రష్మీ కారు హై స్పీడ్ లో వెళుతూ రోడ్డు దాటుతున్న ఒక పాదచారిని గుద్దేసింది. దాంతో ఢీకొట్టిన వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతనిని దగ్గర్లో ఉన్న ఒక గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమించటంతో అక్కడి వారు అతనిని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఇంకా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. పోలీసులు ఈ విషయమై విచారణ మొదలుపెట్టారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియ చేయనున్నారు.

Ruthvik

Ruthvik

Next Story