అతని బండారం బయటపెట్టిన రష్మీ

Ruthvik
Published on: 12 March 2019 2:59 PM IST
అతని బండారం బయటపెట్టిన రష్మీ
X

ఈ మధ్య కాలంలో చాలా మంది తాము పిఆర్ మేనేజర్లము అనే ముసుగు తో అమ్మాయిలను మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి ఒకరి బండారాన్ని హాట్ యాంకర్ రష్మీ బయట పెట్టింది. ఒకతను రష్మీ నుండి ట్విట్టర్ ద్వారా రష్మీ వాళ్ళ నాన్న గారి నంబర్ తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అతడికి రష్మీ గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. "మీ నాన్నగారి నెంబర్ మిస్ అయింది. యాడ్ షూటింగ్ కోసం మీ నాన్నగారితో మాట్లాడాలి. నెంబర్ పంపిస్తారా" అని ఒకతను రష్మీ కి ట్వీట్ చేసాడు.

"నాకు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. కాబట్టి నీకు మా నాన్న గారి నంబర్ దొరికే అవకాశం లేదు. నువ్వు పి ఆర్ మేనేజ్మెంట్ అన్న పేరుతో జనాల్ని మోసం చేయడం ఆపేస్తే మంచిది. ఇలా అమ్మాయిలను మోసం చేస్తూ మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చెడ్డపేరు తెస్తున్నారు" అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఈ విధంగా అతగాడి ఆటకట్టించింది జబర్దస్త్ బ్యూటీ రష్మీ. ఇక ఈమె జబర్దస్త్ లాంటి షో లతో మరియు సినిమాలతో బాగానే బిజీగా వుంది.

Ruthvik

Ruthvik

Next Story