Anchor Prashanthi: ఫాలోయింగ్ చూసి కాదు.. బిగ్ బాస్ లో ఆడిన వాళ్ళకే సపోర్ట్ చేయండి

Anchor Prashanthi: ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారంతా తనకి స్నేహితులేనని వారందరికీ తన మద్దతు ఉంటుందని తెలిపింది...

Sandeep Reddy
Published on: 13 Nov 2021 12:45 PM IST
Anchor Prashanthi Comments on Bigg Boss 5 Telugu Contestants in Social Media
X

Anchor Prashanthi: ఫాలోయింగ్ చూసి కాదు.. బిగ్ బాస్ లో ఆడిన వాళ్ళకే సపోర్ట్ చేయండి

Anchor Prashanthi: బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సీరియల్స్ తో బిజీబిజీగా గడుపుతున్న ప్రశాంతి ఒక ప్రముఖ ఛానెల్ లో గృహలక్ష్మి అనే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన యాంకర్ ప్రశాంతి బిగ్ బాస్ సీజన్ 5 గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారంతా తనకి స్నేహితులేనని వారందరికీ తన మద్దతు ఉంటుందని తెలిపింది.

అయితే హౌస్ లో ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంటే వారికే ఓట్లు వేసి గెలిపించాలని ప్రశాంతి చెప్పుకొచ్చింది.బయట ఫాలోయింగ్ ఉంది కదా అని ఇంట్లో గేమ్ ఆడకుండా కూర్చునే వారికి సపోర్ట్ చేయొద్దు అని పరోక్షంగా యూట్యూబర్ శన్ముఖ్ జస్వంత్ ని ఉద్దేశించి కామెంట్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శన్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

అయితే బిగ్ బాస్ హౌస్ లో చాలా వారాలపాటు సిరి హనుమంత్, జెస్సీలతో కలిసి మోజో రూమ్ కే పరిమితమైన శన్ముఖ్ జస్వంత్ పై వచ్చే వార్తలకు సోషల్ మీడియాలో శన్ముఖ్ జస్వంత్ అభిమానులుగా చెప్పుకునే కొంతమంది అతిగా రియాక్ట్ అయి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడంతో శన్ముఖ్ జస్వంత్ కి ఉన్న కాస్త పాపులారిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్ధమవుతుంది. నిజమైన అభిమానులు తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించి సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చి కామెంట్స్ చేయడం మానుకుంటేనే తమ అభిమాన కంటెస్టంట్ ని బిగ్ బాస్ విన్నర్ గా చూడొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story