Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

Anchor Pradeep: ప్రముఖ టెలివిజన్ యాంకర్‌, నటుడు ప్రదీప్‌ తండ్రి పాండు రంగ కన్నుమూశారు.

Kranthi
Updated on: 2 May 2021 11:09 AM IST
Anchor Pradeep Father Pandu Ranga Passes Away
X

ఆంచారు ప్రదీప్ ఫామిలీ (ఫైల్ ఇమేజ్)

Anchor Pradeep: ప్రముఖ టెలివిజన్ యాంకర్‌, నటుడు ప్రదీప్‌ తండ్రి పాండు రంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ పరిస్థితి విషమించడంతో ఆయన నిన్న(శనివారం) సాయంత్రం కన్నుమూశారు. మరో వైపు ప్రదీప్ కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో తన మాటల్లో ఎక్కడా అశ్లీలత లేకుండా చూసుకుంటూ తెలుగులో టాప్ షోలకు వ్యాఖ్యాతగా అదరగొడుతుంటారు. ఇటీవల సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యాంకర్ ప్రదీప్‌ను తెలుగువారికి ముఖ్యంగా తెలుగు టీవీ షోలను చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు.

తెలుగు టీవీ తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్ ఇటీవల 30 రోజుల్లో ప్రేమించండం ఎలా అనే సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. జనవరి 29న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎస్వీ బాబు నిర్మించాడు. హీరోయిన్‌గా అమృత అయ్యర్ అనే తమిళ భామ నటించిన విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story