మాటలు "కోట"లు దాటాయా.. అప్పుడు నాగబాబు.. ఇప్పుడు అనసూయ..!?

* కోటా కామెంట్స్ పై స్పందిస్తూ వరుస ట్వీట్లు చేసిన అనసూయ.. * పాపం పెద్దవాడు.., పాపం ముసలాయన అంటూనే వెతకారం..??

Sandeep Reddy
Updated on: 19 Oct 2021 4:00 PM IST
Anchor Anasuya Shocking Comments on Kota Srinivasa Rao in Twitter
X

మాటలు "కోట"లు దాటాయా.. అప్పుడు నాగబాబు.. ఇప్పుడు అనసూయ..!?

Anasuya - Kota Srinivasa Rao: సీనియర్ విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు తాజాగా ఒక పలు ఇంటర్వ్యూలలో కొందరు నటీనటులపై చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అది చాలదు అన్నట్టు ఆయా నటులు కూడా కోటా మాటలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల "మా" ఎన్నికల సందర్భంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై కోటా శ్రీనివాసరావు చేసిన కొన్ని కామెంట్స్ పై నాగబాబు సీరియస్ అయి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మరువక ముందే తాజాగా యాంకర్ అనసూయ సోషల్ మీడియా వేదికగా కోటాపై పరోక్షంగా స్పందించింది.

ఇటీవలే ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు యాంకర్ అనసూయ గురించి మాట్లాడుతూ "అనసూయ అందంగా ఉంటుందని, ఆమె నటించిన సినిమాలు కూడా అన్ని చూశానని కాకపోతే ఆమె పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత కూడా అలా పొట్టి బట్టలు వేయడం పద్దతికాదని, అనసూయ ఎలా ఉన్న అభిమానులు చూస్తారన్న" కోటా కామెంట్స్ పై అనసూయ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

ఈ మధ్యే ఒక సీనియర్ నటుడు నా వస్త్రధారణ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడని, ఎంతో అనుభవం ఉన్న ఆ వ్యక్తి అలా నీచంగా మాట్లాడటం తనని బాధించిందని చెబుతూ.., అదే వ్యక్తి అధ్వాన్నమైన బట్టలు ధరించి మందు తాగుతూ సినిమాల్లో ఆడవాళ్ళను కించపరిస్తే మాత్రం సోషల్ మీడియా ఎందుకు పట్టించుకోదో అర్ధం కావట్లేదని అనసూయ పోస్ట్ చేసింది. ఏదేమైనా సోషల్ మీడియా పుణ్యనా.. అతి తక్కువ సమయంలో యాక్టర్ గా ఎదిగామనో లేదా ఫ్యామిలీల సపోర్ట్ చూసుకొనో తెలియదు కాని ప్రస్తుత నటీనటులు పెద్దా చిన్నా తేడా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మాత్రం సోషల్ మీడియాలో అందరూ గమనిస్తూనే ఉన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story