Anasuya: కోట శ్రీనివాస్ రావుకి ఘాటు రిప్లై ఇచ్చిన యాంకర్ అనసూయ

Anasuya: కోట శ్రీనివాస్ రావు కామెంట్లకి రియాక్ట్ అయిన అనసూయ

admin1
Updated on: 26 Oct 2021 4:20 PM IST
Anchor Anasuya Reacts on Kota Srinivasa Rao Comments
X

కోట శ్రీనివాస రావు కి ఘాటు సమాధానం చెప్పిన అనసూయ (ఫైల్ ఇమేజ్)

Anasuya: తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు యాంకర్ మరియు నటి అయిన అనసూయ భరద్వాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె మంచి నటి, హావభావాలను చక్కగా పలికిస్తోంది అన్న కోటశ్రీనివాసరావు అనసూయ డ్రెస్సింగ్ మాత్రం తనకు నచ్చదని అది మారిస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో లైవ్ లో మాట్లాడుతూ అనసూయ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధతో ఏడవడం లేదని స్ట్రాంగ్ ఎమోషన్ వల్ల అవి కళ్ళ నుండి వస్తున్న నీళ్లు మాత్రమే అని చెప్పిన అనసూయ కోటశ్రీనివాస్ రావు పై ఫైర్ అయ్యారు.

ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఆర్టిస్టులపై మిగతా వాళ్లు చేసే కామెంట్లు ఆ లిమిట్ దాటేస్తున్నాయని అన్నారు అనసూయ. అది తమ ప్రొఫెషన్ అని దాంట్లో వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు అనే విషయం మీద వారి క్యారెక్టర్లను డిసైడ్ చేయకూడదని అది నేరమని అన్నారు. ఆర్టిస్ట్ ల మీద కొందరు తోడేళ్ల లాగా మీద పడి పోతారు అని మీడియా మీద విరుచుకుపడిన అనసూయ కొంతమంది మంచి జర్నలిస్టులు ఉన్నప్పటికీ చాలా మంది మాత్రం యూట్యూబ్ కంటెంట్ కోసం చెత్త థంబ్ నైల్స్ పెట్టి వీడియోలు చేయడానికి ముందుంటారని అన్నారు. దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని ఆమె రిక్వెస్ట్ చేశారు.

admin1

admin1

Next Story