కొడుకు మాటలకు భాగోద్వేగానికి గురైన అనసూయ!

Anasuya Emotional : కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రతి మనిషి జీవితంలో కఠిన పరిస్థితులను ఎదురుకునేలా చేసింది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితి ఎవరికీ రాకుడదని కోరుకొని మనిషి ఉండరు.

Krishna
Published on: 19 Oct 2020 2:20 PM IST
కొడుకు మాటలకు భాగోద్వేగానికి గురైన అనసూయ!
X

Anasuya Emotional : కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రతి మనిషి జీవితంలో కఠిన పరిస్థితులను ఎదురుకునేలా చేసింది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితి ఎవరికీ రాకుడదని కోరుకొని మనిషి ఉండరు. దీనికంటే ముందు గడిచిన సంవత్సరాలను గుర్తుచేసుకుంటే అప్పటిలాగా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. ఆలాగే తెలుగు యాంకర్, నటి అనసూయ కొడుకు కూడా గడిచిన కాలం ఎంతో మధురంగా ఉందని, ఆ కాలానికి వెళ్తానని చెప్పాడట.. కొడుకు మాటలకు అనసూయ భాగోద్వేగానికి లోనైంది.. ఈ సందర్భంగా అనసూయ తన ట్విట్టర్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

"మామ్మా .. నేను గడిచిన కాలానికి వెళ్ళాలనుకుంటూన్నాను. 2017, 2018 సమయంలో కరోనా లేదు. వరదలు లేవు.. అవి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన రోజులు అని చెప్పాడట.. ఈ మాటలు విని తనకు కన్నీళ్ళు ఆగలేదని, అనసూయ చెప్పుకొచ్చింది. మనం ఎలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నాం. రాబోయే తరాల వారికి ఎం అందించానున్నాం". అంటూ ట్వీట్ చేసింది అనసూయ..

అటు అనసూయ భరద్వాజ్‌ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు టీవీ యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా మారింది. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మంచి పాత్రలు దక్కినప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తుంటుంది అనసూయ.. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగామర్తండ అనే సినిమాలో నటిస్తోంది అనసూయ.

Krishna

Krishna

Next Story