Anasuya Video: డ్యాన్సులతో పిచ్చెక్కిస్తున్న అనసూయ

Anasuya Video: అనసూయ.. పరిచయం అక్కరలేని పేరు. జబర్దస్త్ యాంకర్ గా పాపులరై.. యాంకరింగ్ తోపాటు నటనలోనూ అదరగొడుతోంది.

Venkata Chari
Published on: 19 March 2021 4:17 PM IST
Anchor Anasuya Dance Chiranjeevi Song in Jabardasth Show
X
అనసూయ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Anasuya Video: అనసూయ భరద్వాజ్.. పరిచయం అక్కరలేని పేరు. జబర్దస్త్ యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ.. తన యాంకరింగ్ తోపాటు నటనలోనూ అదరగొడుతోంది. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ తళక్కున మెరుస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యాక్టింగ్ కు ప్రాధాన్యం ఉన్న పాత్రలతోనూ రాణిస్తూనే.. స్సెషల్ సాంగ్స్ లోనూ తన డ్యాన్స్ తో మతులుపోగొడుతోంది.

కాగా, ప్రతీవారం గురువారం ప్రసారమయ్యే జబర్ధస్త్ ఎపిపోడ్‌లో యాంకర్ అనసూయ ఎంట్రీ సాంగ్ లో చిందేస్తూ ప్రేక్షకులను అలర్ట్ చేస్తుంది. ఆ పాటల్లో తను ధరించే డ్రెస్సింగ్‌కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. వీటిని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసి ఫాలోవర్స్‌కు నిద్రలేకుండా చేస్తుంది ఈ బ్యూటీ.

అనసూయ డాన్స్

తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలోని జివ్వుమని కొండగాలి పాటకు ఓ రేంజ్‌లో ఇరగదీసేసింది అనసూయ. ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. దీనిని తన ఇన్‌స్టాగ్రాం లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

ప్రస్తుతం అనసూయ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రానున్న 'ఆచార్య' సినిమాలోనే ఓ కీలక పాత్రలో కనిపించనుంది. 'క్షణం' , 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది ఈ జబర్దస్త్ యాంకర్. తాజాగా ఈమె మెగాస్టార్ హీరోగా నటిస్తోన్న 'ఆచార్య'లో కీ రోల్ పోషిస్తోంది. అలాగే తాజాగా రిలీజ్ అయిన 'చావు కబురు చల్లగా' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లోనూ ఆడిపాడింది.


Venkata Chari

Venkata Chari

Next Story