Anasuya: మంచి పాత్ర కోసం ఏమైనా చేయడానికి సిద్ధం అంటున్న అనసూయ

Anasuya: సినిమా కోసం గుండు కొట్టించుకోడానికి కూడా రెడీ అంటున్న హాట్ బ్యూటీ

admin1
Updated on: 10 Nov 2021 9:39 PM IST
Anasuya Shocking Reply To Netizen Over Comments On Her Future Roles
X

అవసరమైతే గుండు కొట్టించుకోవడానికైనా సిద్ధం అంటున్న అనసూయ (ఫైల్ ఇమేజ్)

Anasuya: ఒకవైపు జబర్దస్త్ యాంకర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంన్న టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోవైపు నటిగా మంచి పాత్రలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతోంది. బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా వెలుగుతూ చాలా బిజీగా మారిపోయింది. పర్ఫామెన్స్ కి ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ అలరిస్తున్న అనసూయకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" సినిమా తో మంచి పేరు తెచ్చుకుంది. అయితే మంచి పాత్ర వస్టే ఆ పాత్ర కోసం అనసూయ ఏమైనా చేయడానికి సిద్దంగా ఉందట.

తాజాగా నెటిజన్ల తో ముచ్చటించిన అనసూయ నీ ఒక ఫ్యాన్, "పెద్ద సినిమాలో మంచి పాత్ర చేసే అవకాశం వస్తే ఆ పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా?" అని అడగగా, దానికి అనసూయ "అవసరమైతే తప్పకుండా కొట్టించుకుంటాను" అని చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక అనసూయ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించనుంది. మరోవైపు అల్లు అర్జున్ "పుష్ప" సినిమాలో కూడా అనసూయ మంచి పాత్ర లో కనిపించనుంది.

admin1

admin1

Next Story