Anasuya: ఆ హీరో ఒత్తిడితో అలా చేశాను.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు..

Anasuya Bharadwaj: ఒక న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో లీడ్ రోల్ లో నటించే స్థాయికి ఎదిగారు అనసూయ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 25 Sept 2024 4:52 PM IST
Anasuya Shares Interesting Thing Happened at the Time of Kshanam Movie Shooting
X

Anasuya: ఆ హీరో ఒత్తిడితో అలా చేశాను.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు..

Anasuya Bharadwaj: ఒక న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో లీడ్ రోల్ లో నటించే స్థాయికి ఎదిగారు అనసూయ. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలవడం అనసూయకే దక్కుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ నిత్యం వివాదాలతో సావాసం చేస్తుంటుంది.

అంతేనా తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. 43 ఏళ్ల వయసులో కూడా తనదైన అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది. తనపై జరిగే ట్రోలింగ్స్ ని కూడా అదే స్థాయిలో తిప్పి కొడుతుంది అనసూయ. ఇక అనసూయ కెరీర్ ను మలుపు తిప్పిన, తనలోని ప్రతిభను తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా క్షణం. అడివి శేషు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

పోలీస్ ఆఫీసర్ పాత్రతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే తాజాగా క్షణం మూవీకి సంబంధించి అనసూయ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. మొదట్లో తన ఫోర్ హెడ్ (నుదిటి) చూపించడానికి బాగా భయం వేసేదని తెలిపిన అనసూయ.. కానీ అడివి శేష్ ఫోర్స్ చేయడంతో వెంట్రుకలను లైట్గా దువ్వుకొని జడ వేసుకున్నానని చెప్పుకొచ్చింది.

దాంతో తన ఫోర్హెడ్ చూపించాల్సి వచ్చిందని తెలిపింది. అంతకు ముందు తనను అందరూ బట్ట తల దానా అనేవారని.. కానీ ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఫోర్ హెడ్ను ధైర్యంగా చూపించగలుగుతున్నానని అనసూయ చెప్పుకొచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story