Anasuya: ట్రోలర్ కి ఘాటుగా జవాబు ఇచ్చిన అనసూయ

Anasuya: ట్రోలర్ కి ఘాటుగా జవాబు ఇచ్చిన అనసూయ

admin1
Updated on: 6 April 2022 12:42 PM IST
Anasuya Reacted on the Social Media Troll | Telugu Movie News
X

Anasuya: ట్రోలర్ కి ఘాటుగా జవాబు ఇచ్చిన అనసూయ

Anasuya Bharadwaj: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యాంకర్లలో అనసూయ భరద్వాజ్ పేరు కూడా ముందే ఉంటుంది. ఒక వైపు యాంకర్ గా వరుసగా షోలతో బిజీగా ఉండే అనసూయ మరోవైపు సినిమాల్లో కూడా తన పాత్రలు మరియు నటన తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొనే యాంకర్లలో కూడా అనసూయ పేరు ముందే ఉంటుంది.

అనసూయ ఏం చేసినా ఎలాంటి బట్టలు వేసుకున్నా సోషల్ మీడియా లో ఆమె పై వచ్చే నెగటివ్ కామెంట్లకు లెక్కే ఉండదు. చాలా వరకు ఇలాంటి ట్రోల్స్ ను అనసూయ పెద్దగా పట్టించుకోదు. అయితే అప్పుడప్పుడు మాత్రమే కొన్ని సందర్భాల్లో ఇలాంటి నెగటివ్ కామెంట్స్ కు రెస్పాండ్ అయ్యే అనసూయ భరద్వాజ్ తాజాగా ఒక నెటిజన్ కామెంట్ కి గట్టిగా జవాబిచ్చింది. "అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి.

ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారు" అని ఒక నెటిజన్ అనసూయపై మండిపడగా "దయచేసి మీరు మీ పనిని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగ జాతి పరువు తీస్తున్నారు" అంటూ తన జవాబు తో ఆ నెటిజన్ నోరు మూయించింది అనసూయ.

admin1

admin1

Next Story