జబర్దస్త్ షో నుంచి అనసూయని తప్పిస్తున్నారా?

జబర్దస్త్ షో నుంచి అనసూయని తప్పిస్తున్నారా?
x
Highlights

జబర్దస్త్ షో నుంచి యాంకర్ గా అనసూయ పూర్తిగా తప్పుకోనుందిని వార్తలు వస్తున్నాయి.

తెలుగు బుల్లితెరపై విశేషమైన ఆదరణని సంపాదించుకుంది జబర్దస్త్ షో.. ఓ నలబై ఎపిసోడ్స్ చేసి వదిలేద్దాం అనుకున్న ఈ షో మంచి పాపులారిటీని సంపాదించుకొని ఎనమిది సంవత్సరాలుగా విరామం లేకుండా కొనసాగుతుంది. ఇందులో నుంచి నటుడు నాగబాబుతో సహా పలువురు టీం లీడర్స్ బయటకు వెళ్ళినప్పటికీ ఈ షోకి మాత్రం ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జబర్దస్త్ షో నుంచి యాంకర్ గా అనసూయ పూర్తిగా తప్పుకోనుందిని వార్తలు వస్తున్నాయి.

షో మొదలు నుంచి అనసూయనే యాంకర్ గా చేసుకుంటూ వస్తుంది. మధ్యలో వ్యక్తిగత కారణాల వల్ల షో కి దూరం అయినప్పటికీ మళ్ళీ తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు అనసూయ పూర్తిగా తప్పుకోనుందని ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ షో పాటు జీ తెలుగులో ప్రసారం అయ్యే లోకల్ గ్యాంగ్ లో జడ్జిగా కొనసాగుతుంది. ఇలా రెండు షోలలో కొనసాగుతూ ఉండడంతో అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఎందుకంటే జబర్దస్త్ నిర్వాహకుల కండిషన్స్ ప్రకారం షోలో మెయిన్ లీడ్స్ అయిన వారు వేరే కామిడీ షోలో కనిపించేందుకు వీలులేదని నియమాలు విధించారు. ఈ కండిషన్స్ తో సమస్య వచ్చినందుకే నాగబాబుతో సహా పలువురు జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం నడిచింది. ఈ క్రమంలోనే అనసూయ కూడా అప్పట్లోనే అదిరింది షో కి వెళ్లిపోతారని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ అలా జరగలేదు. అయితే జీటీవీలో ప్రసారం అవుతున్న మరో కామెడి షో లోకల్ గ్యాంగ్ కి జడ్జిగా అనసూయ ప్రత్యేక్షం అయ్యారు.

అక్కడ ఆ షోలో కొనసాగుతూనే జబర్దస్త్ లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే , తాజాగా జబర్దస్త్ షో నుంచి పూర్తిగా అనసూయని తప్పించాలని ఆ షో నిర్వాహకులు భావిస్తున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో ప్రముఖ నటి , బీజేపీ నాయకురాలు ఫైర్ బ్రాండ్ మాధవిలతని ఆది స్కిట్ లో తళుక్కుమని మేరిపించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆ స్కిట్లో మాధవిలత చేసిన పెర్ఫార్మెన్స్ ఆధారంగా అనసూయని జబర్దస్త్ షో నుంచి తప్పించాలని ఈటీవీ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ దీనిపైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories