Anasuya Bharadwaj: ఆ హీరో అభిమానులకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ

Anasuya Bharadwaj: జబర్దస్త్ కామెడీ షో తో స్టార్ యాంకర్ గా మారిపోయిన అనసూయ భరద్వాజ్..

Arun Chilukuri
Published on: 26 Aug 2022 7:19 PM IST
Anasuya Bharadwaj Warns Hero Fans for Calling her Aunty
X

Anasuya Bharadwaj: ఆ హీరో అభిమానులకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ

Anasuya Bharadwaj: జబర్దస్త్ కామెడీ షో తో స్టార్ యాంకర్ గా మారిపోయిన అనసూయ భరద్వాజ్ తాజాగా ఇప్పుడు సినిమాలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు బాడీ షేమింగ్ చేసిన నెటిజన్లకు కౌంటర్ లు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది ఈ భామ.

ఒకవైపు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తూనే మరొకవైపు ఐటమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. తాజా ఈమధ్య అనసూయ చేసిన ఒక పోస్టు ఒక హీరోకి సంబంధించినది అంటూ ఆ హీరో అభిమానులు సోషల్ మీడియాలో ఈమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

అనసూయ ఒక హీరో విషయంలో కావాలని టార్గెట్ చేస్తోంది అంటూ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. ఆమె చేసే ప్రతి ట్వీట్ కింద తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆ హీరో అభిమానులందరికీ ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ. ఇకపై ఈ ట్రోల్స్ ఆపేయాలని మళ్ళీ ఆంటీ అని వయసుకు సంబంధించిన ఇతర కామెంట్లు చేసినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story