Anasuya Bharadwaj: "పుష్ప" సినిమాకి అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!?

Sandeep Reddy
Published on: 23 Dec 2021 2:21 PM IST
Anasuya Bharadwaj Remuneration in Pushpa Movie
X

Anasuya Bharadwaj: "పుష్ప" సినిమాకి అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!?

Anasuya Bharadwaj: ఒకవైపు యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే.. సినిమాల్లోనూ నటిస్తూ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" చిత్రంలో మంగళం శ్రీను భార్యగా దాక్షాయణి పాత్రలో అనసూయ చాలా బోల్డ్ గా నటించింది. తన లుక్ తో పాటు నటనతో ఆ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించేలా అనసూయ చేసింది. అయితే పుష్ప మొదటి భాగంలో అనసూయ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా సెకండ్ పార్ట్ లో ఈమె పాత్ర ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది.

తాజాగా అనసూయ పుష్ప సినిమాకి సంబంధించిన రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోజుకి 1.5 లక్షల నుండి 2 లక్షల దాకా అనసూయ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. "పుష్ప ది రైజ్" లో తక్కువ రోజులే కాల్ షీట్స్ ఇచ్చిన "పుష్ప ది రూల్" లో మాత్రం తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని అందుకోసం ఆమె ఎక్కువ రోజులు కాల్ షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక స్టార్ హీరోయిన్ తరహలో రోజుకి 2 లక్షలు చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటుందంటే అనసూయ క్రేజ్ మాములుగా లేదని చెప్పొచ్చు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story