Anasuya - GodFather Movie: మెగా క్యాంప్ లో సెటిలైపోయిన అనసూయ

admin1
Updated on: 25 Aug 2021 12:45 PM IST
Anasuya Bharadwaj Playing a Key Role in Chiranjeevi GodFather Movie | GodFather Telugu Movie 2021
X

చిరంజీవి -అనసూయ (ఫైల్ ఫోటో)

Anasuya - God Father Movie: ఒకవైపు జబర్దస్త్ యాంకర్ గా గ్లామర్ షో చేస్తున్న టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోవైపు నటిగా మంచి పాత్రలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు బుల్లితెరపై మాత్రమే కాకుండా మరోవైపు సినిమాలతో కూడా అంతే బిజీగా మారిపోయింది. పర్ఫామెన్స్ కి ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకుపోతున్న అనసూయకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" సినిమాతో మంచి పేరు వచ్చింది. రంగమ్మత్తగా అందరి దృష్టిని ఆకర్షించిన అనసూయ తాజాగా ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాలో అనసూయ ఒక ముఖ్య పాత్ర పోషించనుందట. మరోవైపు అల్లు అర్జున్ "పుష్ప" సినిమాలో కూడా అనసూయ మంచి క్యారెక్టర్ లో కనిపించనుంది. చూస్తూ ఉంటే అనసూయ దాదాపు అన్ని మెగా సినిమాలలో కనిపిస్తూ మెగా నటి గా మారిపోనుంది. ఒక వైపు మెగా క్యాంపు లో బిజీగా ఉన్న అనసూయ మరోవైపు శర్వానంద్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న "మహా సముద్రం" సినిమా లో స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ గురించి మాట్లాడిన అనసూయ ఆమెకు చిరంజీవి అంటే చాలా అభిమానం అని, ఆయన పేరు చెబితేనే భక్తితో కూడిన మర్యాద కలుగుతుందని చెప్పుకొచ్చింది.

admin1

admin1

Next Story