Pushpa - Anasuya Poster : "మంగళం శ్రీను" భార్యగా "దాక్షాయని"..!?

Anasuya in Pushpa Movie: "పుష్ప" చిత్రం నుండి అనసూయ "దాక్షాయని" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Sandeep Reddy
Updated on: 10 Nov 2021 2:04 PM IST
Anasuya Bharadwaj to Play Dakshayani Role in Allu Arjun Rashimka Mandanna
X

Pushpa - Anasuya Poster : "మంగళం శ్రీను" భార్యగా "దాక్షాయని"..!?

Pushpa- Anasuya First Look Poster: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన జంటగా నటిస్తున్న "పుష్ప" చిత్రం నుండి తాజాగా యాంకర్ అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. "దాక్షాయని" పాత్రలో కనిపించబోతున్న అనసూయ అసలు భయం అంటే తెలియని ఒక పవర్ ఫుల్ పాత్రలో పుష్ప చిత్రంలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలకు భిన్నంగా అనసూయ "పుష్ప" చిత్రంలో మాస్ లుక్ లో కనిపిస్తుంది.

ఇటీవలే మంగళం శ్రీను పాత్రలో నటుడు సునీల్ నటించబోతున్నట్లు పోస్టర్ ని కూడా పుష్ప చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే దాక్షాయని, మంగళం శ్రీను పోస్టర్ లను పరిశీలిస్తే "పుష్ప" చిత్రంలో సునీల్, అనసూయ భార్యభర్తలుగా నటించనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story