Anasuya About Casting Couch : కాస్టింగ్ కౌచ్ పై అనసూయ ఏమందంటే?

Anasuya About Casting Couch : అనసూయ.. పెద్దగా పేరుకి పరిచయం అక్కరలేదు.. న్యూస్ ప్రజెంటర్ నుంచి స్టార్ యాంకర్ గా ఎదిగింది అనసూయ..

Krishna
Published on: 13 Aug 2020 10:39 AM IST
Anasuya About Casting Couch : కాస్టింగ్ కౌచ్ పై అనసూయ ఏమందంటే?
X
Anasuya Bharadwaj ( File Photo)

Anasuya About Casting Couch : అనసూయ.. పెద్దగా పేరుకి పరిచయం అక్కరలేదు.. న్యూస్ ప్రజెంటర్ నుంచి స్టార్ యాంకర్ గా ఎదిగింది అనసూయ.. ఒకపక్కా బుల్లితెర పైన అలరిస్తూనే మరోపక్కా మంచి పాత్రలు దక్కినప్పుడు వెండితెర పైన కూడా అలరిస్తుంది అనసూయ... క్షణం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో కనిపించి అనసూయలో కొత్త కోణాన్ని అందరికి పరిచయం చేసింది.. ఈ సినిమా తరవాత అనసూయకి బాగానే అవకశాలు వచ్చినప్పటికీ ఆచితూచి కథలను ఎంచుకుంటుంది అనసూయ..

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ HMTV ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిచింది అనసూయ.. అందులో భాగంగానే క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందించింది. తాను అవకాశలకోసం ఎప్పుడూ వెళ్లలేదని కేవలం వచ్చిన అవకాశాలను మాత్రమే ఉపయోగించుకున్నానని స్పష్టం చేసింది.. అదృష్టవశాత్తు నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది. అవకాశాల కోసం తప్పు చేయకుండా ఎదురు చూడాలని, అది మనం స్పందించే దానిపైన ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఇక ఫేవరెట్ ఇజం వల్ల తానూ అవకాశాలని మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది అనసూయ..

ఇక అనసూయ జబర్దస్త్ తో పాటుగా పలు షో లతో బిజీ అయిపొయింది. అంతేకాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో అనసూయకి మంచి పాత్ర దక్కింది. ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. హాస్యనటుడు బ్రహ్మనందం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో కూడా అనసూయ నటిస్తుందని సమాచారం.


Krishna

Krishna

Next Story