Ananya Pandey With Mahesh Babu : మహేష్ సరసన విజయ్ దేవరకొండ హీరోయిన్?

Ananya Pandey With Mahesh Babu : ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం

Krishna
Published on: 4 Aug 2020 6:25 PM IST
Ananya Pandey With Mahesh Babu : మహేష్ సరసన విజయ్ దేవరకొండ హీరోయిన్?
X
ananya pandey, mahesh babu(File Photo)

Ananya Pandey With Mahesh Babu : ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక స్క్రిప్టు వర్క్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టలెక్కనుంది.. ప్రస్తుతం చిత్ర యూనిట్ నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉంది..

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారు మేకర్స్ .. ఈ విషయాన్ని కీర్తినే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఛాన్స్ ఉందట.. ఆ పాత్ర కోసం ఇప్పటికే చాలా మందిని అనుకున్నారు మేకర్స్.. అందులో భాగంగానే తమిళ నటి నివేతా థామస్ ని ఎంపిక చేశారని వార్తలు కూడా వచ్చాయి. కానీ దీనిపైన చిత్ర యూనిట్ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు.. ఇక ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హీరోయిన్ పేరు కూడా చేరిపోయింది.

ఆమె బాలీవుడ్ భామ అనన్య పాండే.. ప్రస్తుతం ఆమె పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. అయితే ఈ భామను సర్కారీ వారి పాటలో సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచనలో ఉందట. దీనిపైన చిత్రయూనిట్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం న్యూస్ వైరల్ అవుతుంది.

ఇక మహేష్ బాబుకి 27వ చిత్రంగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట అనే సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Krishna

Krishna

Next Story