Ambani Pre-Wedding: వైభవంగా అనంత్- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు

Ambani Pre-Wedding: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిన్నటితో ముగిశాయి.

Dhatripriya
Published on: 4 March 2024 6:23 PM IST
Ananth- Radhika Merchant Pre-Wedding Celebrations Are Over
X

Ambani Pre Wedding: వైభవంగా అనంత్- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు 

Ambani Pre Wedding: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిన్నటితో ముగిశాయి. హస్తాక్షర్- ది వ్యాలీ ఆఫ్ గాడ్స్ ఈవెంట్‌తో సెలబ్రేషన్స్‌కు ముగింపు పలికారు. మార్చి 1 నుంచి 3 వరకు వేలాది అతిథుల మధ్య గుజరాత్ జామ్‌నగర్‌లో అట్టహాసంగా ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరిగాయి. తొలి రోజు కాక్‌టెయిల్ పార్టీ, రెండో రోజు జంగిల్ ఫీవర్- వాక్ ఆన్ వైల్డ్‌సైడ్ వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలకు భారత్ సహా విదేశాల నుంచి కూడా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సినీ, క్రీడా, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అంతా కలిసి సందడి సందడిగా గడిపారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న అనంత్- రాధికా జంటను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాల్లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీ చేసిన డాన్స్, బాలీవుడ్ ఖాన్స్ త్రయం షారుక్ ఖాన్- సల్మాన్ ఖాన్- ఆమిర్ ఖాన్‌లతో కలిసి రామ్ చరణ్ డాన్స్, పాప్ క్వీన్ రిహన్నా అదిరిపోయే పెర్ఫామెన్స్, ఆమెతో కలిసి జాన్వీ కపూర్ చేసిన డ్యాన్స్, నీతా అంబానీ నాట్య ప్రదర్శన, అనంత్ అంబానీ వాచ్ వంటివి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ముఖ్యంగా నీతా అంబానీ చేసిన డాన్స్ షో అనేక మందిని ఆకట్టుకుంటుంది. ఆమె తన ప్రదర్శనను మనవరాలు ఆదియ శక్తి, వేద స్త్రీ శక్తికి ప్రతిరూపమైన యువతులందరికీ అంకితం చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.

ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రాధికా మర్చంట్ ఎంట్రీ అదిరిపోయింది. 2001లో వచ్చిన హిందీ సినిమా కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలోని మెలోడీ సాంగ్ దేఖా తెను పెహ్లీ పెహ్లీ బార్ వే పాటకు తగ్గట్లుగా స్టెప్స్‌ వేస్తూ.. చక్కటి అభినయం ప్రదర్శిస్తూ.. అనంత్ అంబానీ దగ్గరికి చేరింది. రాధికా మర్చంట్ నడుచుకుంటూ వస్తున్న సమయంలో అక్కడ ఉన్న అతిథులంతా పెద్ద అరుస్తూ కొత్త జంటను ఉత్సాహపరిచారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలో రాధికా మర్చంట్ ఎంట్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Dhatripriya

Dhatripriya

Next Story