Project K: నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు.. హాలీవుడ్‏ను బీట్ చేయబోతున్నావంటూ..

Project K: ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ప్రాజెక్టకే" సినిమా షూటింగ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో శరవేగంగా జరుగుతోంది.

Arun Chilukuri
Updated on: 14 March 2022 9:30 PM IST
Anand Mahindra Says Project K Going to Beat Hollywood
X

Project K: నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు.. హాలీవుడ్‏ను బీట్ చేయబోతున్నావంటూ..

Project K: ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ప్రాజెక్టకే" సినిమా షూటింగ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇప్పుడు ఈ సినిమా కోసం కొన్ని న్యూ జనరేషన్ కార్లను తయారు చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తమ సినిమాకి కార్ల తయారీలో హెల్ప్ కావాలని నాగ్ అశ్విన్ అడగగా మహీంద్రా గ్రూప్ కి సంబంధించింది ప్రొడక్ట్ డెవలప్మెంట్ నుండి వేలు తమకు సహాయం చేస్తారని స్వయంగా ఆనంద్ రిప్లై ఇచ్చారు.

తాజాగా మహేంద్ర వ్యాలీ కి వెళ్లిన నాగ అశ్విన్ "ఆనంద్ మహీంద్రా.. రిసెర్చ్ వ్యాలీ అద్భుతంగా ఉంది. ప్రకృతితో టెక్నాలజీ మమేకమై చాలా అందంగా కనిపిస్తోంది. మీతో మా జర్నీ మొదలు పెట్టటం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది" అని చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్ కు జవాబిస్తూ ఆనంద్ మహీంద్రా "నాగ్ అశ్విన్.. మీరు రూపొందిస్తున్న ఈ బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ సినిమా గురించి నేను ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మీరు ఈ సినిమాతో హాలీవుడ్ కొడతారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story