విజయ్ పైన నటుడు కామెంట్.. ఆనంద్ కౌంటర్!

Anand Deverakonda : తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రాజకీయాలపైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Krishna
Published on: 12 Oct 2020 3:30 PM IST
విజయ్ పైన నటుడు కామెంట్.. ఆనంద్ కౌంటర్!
X

Vijay Deverakonda, Anand Deverakonda 

Anand Deverakonda : తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రాజకీయాలపైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అయితే విజయ్ కామెంట్స్ పట్ల పలువురు నెటిజన్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ కి చెందిన గుల్షన్‌ అనే నటుడు విజయ్ కామెంట్స్ పట్ల అసహనం వ్యక్తం చేశాడు.

'తలలో ఉన్న ఒత్తిడిని కొంతమేర తగ్గించుకోవడానికి మీకు ఓ హెయిర్‌కట్‌ సూచిస్తా' అని కామెంట్ పెట్టాడు. అయితే ఈ కామెంట్ పట్ల విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ స్పందించాడు. 'తెలివైన వారు ఎవరైనా.. ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడారో ముందు అర్థం చేసుకుంటారు. అంతేకానీ సదరు వ్యక్తి గురించి సోషల్‌మీడియా వేదికగా వ్యక్తిగత కామెంట్లు చేయరు' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి!


ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మొదలై అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ.. ఇక ఆ సినిమా తర్వాత గీతా గోవిందం భారీ హిట్ కావడంతో విజయ్ స్థాయి మరింతగా పెరిగింది. ఇక ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ అంతగా మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

కరొనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చార్మీ రూపొందిస్తున్నారు. సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమా విజయ్ కి పదోది కాగా, పూరికి 37 వ సినిమా .

Krishna

Krishna

Next Story