Custody: కస్టడీ నుంచి రిలీజ్ అయిన నాగచైతన్య...

An interesting Update About the Shooting of Naga Chaitanya Movie Custody
x

నాగచైతన్య "కస్టడీ" సినిమా షూటింగ్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ 

Highlights

Custody: షూటింగ్ పూర్తి చేసుకున్న నాగచైతన్య "కస్టడీ" సినిమా

Custody: "థాంక్యూ" సినిమా తో పెద్దగా మెప్పించలేకపోయిన అక్కినేని నాగచైతన్య తాజాగా ఇప్పుడు "కస్టడీ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కు సిద్ధమవుతోంది. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఒక చిన్న వీడియోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపిన చిత్ర బృందం అయితే ఈ సినిమాలో ఒక పాట షూటింగ్ కోసం చిత్ర బృందం ఏడు విభిన్న షూటింగ్ సెట్లలో షూటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఏడు విభిన్న ప్రదేశాలలో ఈ పాట షూటింగ్ చిత్రీకరించారట.

యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ ను వెచ్చిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories