Amrutha: మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకే.. వర్మపై అమృతప్రణయ్ కామెంట్స్

Amrutha: మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకే.. వర్మపై అమృతప్రణయ్ కామెంట్స్
x
Highlights

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఫాదర్స్‌ డే సందర్భంగా' మర్డర్‌' సినిమాకు సంబంధంచి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఫాదర్స్‌ డే సందర్భంగా ' మర్డర్‌' సినిమాకు సంబంధంచి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ప్రణయ్‌ హత్య' నేపథ్యంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ వివాదాస్పమైంది. తాజాగా దీనిపై అమృతప్రణయ్ స్పందించారు. పోస్టర్‌ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అన్నారు. ఇప్పటికే తన జీవితం తలకిందులైంది. ప్రేమించిన ప్రణయ్‌ను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి కూడా దూరమయ్యాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? అని నిలదీశారు.

ఈ సందర్భంగా అమృతప్రణయ్ స్పందిస్తూ.. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పోస్టర్‌ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికి పోయాను. నా కొడుకుని చూసుకుంటూ.. ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నిస్తున్నా..ఇంతలోనే మరోసారి సమాజం కళ్లన్నీ నాపై పడేలా వర్మ చేస్తున్నాడు'' అని అమృత ఆవేద వ్యక్తం చేశారు. సమాజంలో ఎవరికి వారు నా గురించి, నా వ్యక్తిత్వం గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నా సన్నిహితులకు తప్ప నా గురించి ఎవరికీ తెలియదు. పరువుపోతుందన్న ఆలోచనల్లో పడి ప్రణయ్‌ను నా తండ్రి హత్య చేయించాడు. కిరాయి గూండాలకు డబ్బులిచ్చి ఈ పాపానికి ఒడిగట్టాడు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆత్మగౌరవంతో బతుకుతున్నాను రామ్‌గోపాల్‌ వర్మ రూపంలో మరో కొత్త సమస్య ఎదురవుతోంది. దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు. హృదయం బండబారి పోయింది. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దని వాపోయారు.

రాంగోపాల్ వర్మ విడుదల చేసిన పోస్టర్‌ చూశాను. దీనికి నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. మా పేర్లను ఉపయోగించి అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. పేరు కోసం నీ లాంటి ఓ ప్రముఖ డైరెక్టర్ ఇంత నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది. నీపై ఎలాంటి కేసులు వేయను. ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో నువ్వూ ఒకడివే. ఎన్నో బాధలను అనుభవించా... ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్‌ ఇన్‌ పీస్‌'' అని అమృత ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా.. ప్ర‌ణ‌య్ హ‌త్య నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. 'ఓ తండ్రి కూతురిని అతిగా ప్రేమిస్తే ఎంత ప్ర‌మాద‌మో తెలిపే అమృత‌, మారుతీరావు క‌థ‌తో వస్తున్న ఈ చిత్రం హృద‌యాల్ని క‌దిలిస్తుంది. శాడ్ ఫాద‌ర్స్ ఫిల్మ్ పోస్ట‌ర్‌ను ఫాద‌ర్స్ డే రోజున విడుద‌ల చేస్తున్నా' అని రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశారు.

ఈ సినిమాకు ఆనంద్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌ట్టి కరుణ‌, న‌ట్టి క్రాంతి నిర్మాతలు. అనురాగ్ కంచ‌ర్ల స‌మ‌ర్పిస్తున్నారు. ఏడాదిన్న‌ర క్రితం త‌న కుమార్తె అమృత భ‌ర్త ప్ర‌ణ‌య్‌ను మారుతీరావు ప‌రువు హ‌త్య చేయించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల మారుతీరావు కూడా ఆత్మహ‌త్య చేసుకున్నారు. గ‌తేడాది వ‌ర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌', 'అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌ బిడ్డలు' సినిమాలతో వర్మ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక శశిక‌ళ బ‌యోపిక్‌తో పాటు దిశ ఘ‌ట‌న‌తో సినిమా తెరకెక్కిస్తున్న‌ట్లు చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories