FCUK మూవీలో అమ్ము న్యూలుక్ అదిరిపోయింది

Samba Siva Rao
Published on: 28 Dec 2020 7:08 PM IST
FCUK మూవీలో అమ్ము న్యూలుక్ అదిరిపోయింది
X

టాలీవుడ్‎లో జగపతి బాబు తనదైన ముద్రవేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఆయన విలక్షణ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నన్యూ మూవీ FCUK (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) అనేది ఈ సినిమా టైటిల్ లోని అర్థం. రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృదం.

ఈ చిత్రాన్ని రంజిత్ మూవీస్ బ్యానర్‌పై ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జగపతి బాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, చైల్డ్ ఆర్టిస్ట్ సహశ్రిత తదితరులు ముఖ్యపాత్ర షోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌పై చిత్రయూనిట్ ఫోకస్ పెట్టింది. కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన జగపతి బాబు లుక్ ఆకట్టుకుంది. తాజాగా అమ్ము అభిరామి లుక్ కూడా బయటకు వచ్చింది.. అమ్ము అభిరామి తమిళంలో దనుష్ సరసన 'అసురన్' సినిమాలో నటించింది.

ఈ సినిమాలో ఈ FCUK సినిమాలో అమ్ము అభిరామి ఉమా పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అమ్ము అభిరామి చేతిలో తెల్లకోటు, స్టెతస్కోపుతో కనిపించింది. ఈ పోస్టర్‏ను బట్టి చూస్తే డాక్టర్‏గా నటిస్తున్నట్లు అర్థమవుతోంది. చిత్రంలో అమ్ము పాత్ర రొమాంటిక్‏గా.. ఉండటమే గాక చాలా కీలకం అని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story