Amitabh Bachchan: పూలు అమ్ముకునే అమ్మాయికి లెక్కపెట్టకుండా డబ్బులిచ్చిన బిగ్‌బీ.. సంకోచంతో డబ్బులు తీసుకుని.. బొకే ఇచ్చిందన్న అమితాబ్‌

Amitabh Bachchan says he didnt count but just gave some money to a girl selling roses
x

Amitabh Bachchan: పూలు అమ్ముకునే అమ్మాయికి లెక్కపెట్టకుండా డబ్బులిచ్చిన బిగ్‌బీ.. సంకోచంతో డబ్బులు తీసుకుని.. బొకే ఇచ్చిందన్న అమితాబ్‌

Highlights

Amitabh Bachchan: అమ్మాయి ముఖంలో సంతోషం తనను కట్టిపడేసిందన్న బిగ్ బీ

Amitabh Bachchan: రోడ్డుమీద పూలు అమ్ముకునే అమ్మాయికి చేసిన ఆర్థిక సాయం గురించి అమితాబ్ బచ్చన్ ఆసక్తిర విషయం వెల్లడించాడు. ఇటీవల ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తనకు ఎదురైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఓ రోజు భారీ వర్షం కురుస్తున్న సమయంలో చౌరస్తాలో ఉన్న సిగ్నల్‌ దగ్గర ఒకమ్మాయి ప్లాస్టిక్ కవర్ కప్పుకుని గులాబీ పూలు అమ్ముతూ అమితాబ్‌కు కనిపించింది. అతని దగ్గరకు రాగానే ఆ గులాబీల ధర అడగకుండానే వెంటనే తన దగ్గరున్న డబ్బు లెక్కించకుండానే ఆమెకు ఇచ్చారట.

తర్వాత కూడా ఎంత ఇచ్చానని ఆమెను అడగలేదు అమితాబ్ బచ్చన్‌. ఆ డబ్బులను సంకోచంగానే తీసుకున్న అమ్మాయి.. భయంతోనే తన దగ్గరున్న బొకేని అందజేసిందని తన బ్లాగ్‌లో రాశారు అమితాబ్ బచ్చన్. ఆ సమయంలో అమ్మాయి ముఖంలో సంతోషం తనను కట్టిపడేసిందని.. కష్టజీవులు శ్రమకు మించిన ఫలితం ఆశించరని చెబుతూ తనదైన స్టైల్‌లో ఆమెను పొగిడేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories