Amitabh Bachchan Plants A Tree : అమ్మ పేరుతో మొక్కను నాటిన అమితాబ్..

Amitabh Bachchan Plants A Tree : అమ్మ పేరుతో మొక్కను నాటిన అమితాబ్..
x
Amitabh Bachchan plants Gulmohar tree in mother Teji Bachchan's name
Highlights

Amitabh Bachchan Plants A Tree : అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ స్టార్ హీరో.. ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు..

Amitabh Bachchan Plants A Tree : అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ స్టార్ హీరో.. ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.. 65 ఏళ్ల వయసులో కూడా ఇంకా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇప్పటికి ఆయనకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. తాజాగా అమితాబ్ బ‌చ్చన్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బీకి అనేక ఆరోగ్య సమ‌స్యలు ఉన్నప్పటికీ వాటిని దాటుకుంటూ క‌రోనాని ధైర్యంగా జ‌యించారు బిగ్ బీ... కరోనాని జయించిన తర్వాత తొలిసారిగా బ‌య‌ట‌కు వ‌చ్చారు అమితాబ్...

తన ఇంటి ఆవరణంలో కొన్ని దశాబ్దాల కిందట నాటిన చెట్టు ఇటీవల నేలకొరడంతో అయన అదే ప్లేస్ లో మరో మొక్కను నాటారు.. దీనిని బిగ్ బీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ భారీ 'గుల్‌మోహర్‌' చెట్టును నేను 1976లో నా ఇల్లు 'ప్రతీక్ష'లో స్వయంగా నాటాను. కానీ ముంబైలో కురిసిన భారీ వర్షాలకు ఈ చెట్టు నేలకొరిగింది. దీనితో తాజాగా మా అమ్మగారి పుట్టిన రోజున ఆగస్టు 12న పడిపోయిన ఆ చెట్టు స్థానంలో మరో మొక్కను నాటాను.. ఈ మొక్కను మా అమ్మ(తేజి బచ్చన్‌)పేరుతో నాటాను అని బిగ్ బీ పేర్కొన్నారు.



ఇక బిగ్ బీ తో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందులో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య త్వరగానే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రెండు వారాల క్రితం అమితాబ్ బచ్చన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా కరోనాని జయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories