Sunny Leone: సన్నీలియోన్ ఇంటి పక్కనే డూప్లెక్స్ హౌస్ కొన్న బాలీవుడ్ హీరో

Sunny Leone: అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 13 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది

Samba Siva Rao
Published on: 29 May 2021 12:39 PM IST
Amitabh Bachchan buys a whopping Sunny Leone to be his neighbour
X

Sunny Leone File Photo

Sunny Leone: బాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుడు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కొత్త ఇంటికి కొనుగోలు చేశాడు. అమితాబ్ బచ్చన ముంబైలో మరో డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేశారు. 5,184 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇంటిని రూ. 31 కోట్లతో ఆయన కొన్నారు. ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది.

ఈ ఇంటికి ఆరు కార్ పార్కింగ్ లు ఉన్నాయి. గత డిసెంబర్ లో ఈ ఇంటిని కొన్నప్పటికీ... ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇదే బిల్డింగ్ లో బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కూడా ఇంటిని కొనుగోలు చేసింది. మరోవైపు, అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 13 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు ఇమ్రాన్ హష్మి, రణబీర్ కపూర్, అలియా భట్ లతో మూవీ ఒక‌టి విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story