Project K Movie: ప్రభాస్ "ప్రాజెక్ట్ కె" లో అమితాబ్, దీపిక పదుకునే

Sandeep Reddy
Published on: 26 July 2021 1:28 PM IST
Amitabh Bachchan And Deepika Padukone Joined in Prabhas Project-K Movie Shoot
X

ప్రాజెక్ట్ కె సినిమా షూట్ ప్రారంభం

"Project-K" Movie: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో "ప్రాజెక్ట్ కె" పేరుతో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాకి ప్రభాస్ క్లాప్ కొట్టగా బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కొన్ని సన్నివేశాల్లో నటించాడు. ఇక ఈ సినిమాలో దీపిక పదుకునే హీరోయిన్ గా నటించనుండగా ప్రస్తుతం దీపిక మరియు అమితాబ్ కి సంబంధించిన కొన్ని సోలో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి వాడే కెమెరా అలెక్సా గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. అయితే హాలీవుడ్ లో అవెంజర్స్, టెర్మినేటర్ వంటి సినిమాలకి వాడిన కెమెరానే కొన్ని సన్నివేశాల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది.

భవిష్యత్తులో రాబోయే రోబోల ఆధారంగా ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం కొన్ని రోబోటిక్ వాహనాలను కూడా చిత్ర యూనిట్ ఉపయోగిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సమాచారాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇక మరోపక్క ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లతో కూడా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక షూటింగ్ కి క్లాప్ కొట్టిన ప్రభాస్ గురించి అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో తహన బాహుబలి వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది తన సినిమాలో నా మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టడం చాలా సంతోషంగా ఉందని అమితాబ్ తెలిపాడు. ప్రాజెక్ట్ కె సినిమా సినిమా గురు అమితాబ్ తో మొదలైందని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story