Acharya Movie: అమెజాన్ ప్రైమ్ వీడియో వారి చేతికి చిక్కిన ఆచార్య డిజిటల్ రైట్స్

Amazon Prime Video Bought the Theatrical Digital Streaming Rights of Acharya Movie
x

 ప్రైమ్ వీడియో వారి చేతికి చిక్కిన ఆచార్య డిజిటల్ రైట్స్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* ఆచార్య రైట్స్ ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, పూజా హెగ్డే రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. తాజా సమాచారం ప్రకారం డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. "ఆచార్య" పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది అమెజాన్ ప్రైమ్.

అంటే థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తరువాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ ఆఖరి స్టేజ్ లో ఉంది. రస్టిక్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉండబోతోంది.

రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories