అదిరిపోయే ఆఫర్ లని తిరస్కరిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" బృందం

"ఆర్ ఆర్ ఆర్" నిర్మాతలకి అదిరిపోయే డీల్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్

admin1
Updated on: 8 Jan 2022 7:01 PM IST
Amazon Prime Offer To RRR Movie Team | Telugu Movie News
X

అదిరిపోయే ఆఫర్ లని తిరస్కరిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" బృందం

Amazon Prime Offer To RRR Team: బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పైగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా చూడడానికి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో గతేడాది జూలైలో విడుదల కావాల్సిన సినిమా ని వాయిదా వేసుకుంటూ వచ్చి జనవరిలో విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారు కానీ ఇప్పుడు అది కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం ప్రముఖ డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు "ఆర్ ఆర్ ఆర్" నిర్మాతలతో కు ఒక అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట.

ఈ మధ్యకాలంలో కొంతమంది దర్శక నిర్మాతలు సినిమాని పే-పర్-వాచ్ మోడల్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. "ఆర్ ఆర్ ఆర్" సినిమాని కూడా అలానే విడుదల చేస్తే కనీసం సినిమాకి 200 కోట్ల దాకా రెవెన్యూ వస్తుంది. కానీ ఈ చిత్ర నిర్మాతలకు ఇది ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే ఆమెజాన్ వారు ఇచ్చిన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. "ఆర్ ఆర్ ఆర్" వంటి సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే 400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు నమోదు అవుతాయని అందుకే ఈ పే-పర్-వాచ్ మోడల్ కానీ డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయడం కానీ ఇటువంటి వి పాన్ ఇండియన్ సినిమాకి వర్కౌట్ అవ్వవని కరాఖండిగా చెప్పేశారు దర్శకనిర్మాతలు.

admin1

admin1

Next Story