Nagarjuna: నాగార్జున సినిమా ని రిజెక్ట్ చేసిన హీరోయిన్

Amala Paul: కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ ఈ మధ్యనే "కుడి ఎడమైతే" అనే వెబ్ సిరీస్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 20 Feb 2022 7:00 PM IST
Amala Paul Loses Movie With Nagarjuna
X

Nagarjuna: నాగార్జున సినిమా ని రిజెక్ట్ చేసిన హీరోయిన్

Amala Paul: కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ ఈ మధ్యనే "కుడి ఎడమైతే" అనే వెబ్ సిరీస్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటోంది. అసలు టాలీవుడ్ నుంచి ఈమెకి ఆఫర్లే లేవని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు తెలుగు నిర్మాతలు ఆమె కి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించినా ఆమె మాత్రం చాలా సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈమె ఒక సీనియర్ హీరోతో నటించే అవకాశం వచ్చినా సరే అమలాపాల్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక వివరాల్లోకి వెళితే కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో "ఘోస్ట్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ కాజల్ త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అమలాపాల్ ను సంప్రదించగా అమలా మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఒకవైపు యువ హీరోయిన్లు సైతం నాగార్జున వంటి హీరో తో రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తూన్నప్పటికీ అమలాపాల్ నాగ్ ను రిజెక్ట్ చేయడం పై అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story