నాగార్జునతో ముద్దు కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్

* "ఘోస్ట్" సినిమాలో నాగార్జునతో ముద్దు కోసం రెమ్యునరేషన్ పెంచిన అమలాపాల్

admin1
Updated on: 23 Oct 2021 2:00 PM IST
Amala Paul Increases her Remuneration for Nagarjuna New Movie Ghost | Tollywood News Today
X

అమల పాల్ - నాగార్జున (ఫైల్ ఫోటో)

Nagarjuna Ghost Movie - Amala Paul: ఈ మధ్యనే "వైల్డ్ డాగ్" సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాగార్జున అక్కినేని తాజాగా ఇప్పుడు "ఘోస్ట్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిజానికి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది కానీ కాజల్ స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకుంది. అయితే కాజల్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆఫర్ ఇప్పుడు సౌత్ బ్యూటీ అమలాపాల్ కి వచ్చింది.

గత కొంత కాలంగా తెలుగులో మంచి సినిమా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న అమలాపాల్ కి "ఘోస్ట్" సినిమా రావడంతో ఆమె కూడా వెంటనే ఒప్పుకుంది. అయితే సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ లో ఒక సన్నివేశంలో అమలాపాల్ హిల్ స్టేషన్ లో నాగార్జునకి ముద్దు పెట్టాల్సిన సన్నివేశం ఉంది.

దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ ఫిలిం సిటీలో జరుగుతోంది. అయితే దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాలో అమలాపాల్ మరియు నాగార్జున మధ్య రొమాన్స్ బాగా చూపించాలని వారి మధ్య ఒక లిప్ లాక్ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి సీనియర్ హీరోల సరసన నటించడానికి హీరోయిన్లు దొరకడమే గగనమైపోయింది ఇలాంటి సమయంలో హీరోతో ముద్దు సన్నివేశం అంటే కొంచెం కష్టమే.

అయితే ఈ నేపథ్యంలో అమలాపాల్ ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ ను తీసుకోబోతోందట. అందుకే నాగార్జునతో కలిసి కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించింది అమల అని సమాచారం.

admin1

admin1

Next Story