Astrologer Venu Swamy: ఏజెంట్ ఫ్లాప్ కి కారణం అమల..? సంచలన విషయాలు చెప్పిన వేణు స్వామి..

Astrologer Venu Swamy: అక్కినేని మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అఖిల్.

Arun Chilukuri
Published on: 2 May 2023 1:03 PM IST
Astrologer Venu Swamy: ఏజెంట్ ఫ్లాప్ కి కారణం అమల..? సంచలన విషయాలు చెప్పిన వేణు స్వామి..
X

ఏజెంట్ ఫ్లాప్ కి కారణం అమల.. సంచలన విషయాలు చెప్పిన వేణు స్వామి..

Astrologer Venu Swamy: అక్కినేని మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అఖిల్. 2015లో వచ్చిన అఖిల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని అందగాడు రీసెంట్ గా రిలీజైన ఏజెంట్ మూవీతో కలుపుకొని 5 సినిమాలు చేశాడు. అయితే ఇప్పటివరకు బాక్సాఫీస్ హిట్ అఖిల్ కు అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. తొలి చిత్రం అఖిల్ భారీ అంచనాల మధ్య విడుదలై ఓపెనింగ్స్ రాబట్టినా ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఆ తర్వాత వచ్చిన హలో చిత్రం కూడా కమర్షియల్ హీరోగా అఖిల్ ను నిలబెట్టలేకపోయింది. మిస్టర్ మజ్నూ చిత్రం అయితే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం కాస్త ఊరటను ఇస్తే ఇక రీసెంట్ గా రిలీజైన ఏజెంట్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

ఏజెంట్ మూవీ అఖిల్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిస్తే..ఈ మూవీకి చేదు ఫలితం ఎదురుకావడంపై సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని, ఈ దోషం ఉన్నవారు సొంత నిర్ణయాలు తీసుకోవాలే తప్పా ఎవరి సలహాలు పాటించకూడదని వేణు స్వామి చెప్పాడు. మదర్ చంద్రుడికి.. పాదర్ సూర్యుడికి సంకేతమని ఆయన అన్నారు. ముఖ్యంగా అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి తల్లి అమల ప్రమేయం కలిసి రాదని చెప్పాడు.

వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సెలబ్రిటీ జ్యోతిష్కుడు చెప్పాడనే హీరోయిన్ రష్మిక మందనా, నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు చేయించుకున్నారు కూడా. సమంత-నాగచైతన్య విడిపోతారని ఆయన ముందే చెప్పాడు. అలాగే ప్రభాస్ కు రాబోయే రోజుల్లో భారీ ఫ్లాపులు తప్పవని కూడా హెచ్చరించాడు. ఏదిఏమైనా, అఖిల్ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. మరి, వేణుస్వామి ఆధ్వర్యంలో ఏమైనా ప్రత్యేక పూజలు చేయించుకుంటాడేమో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story