ఆహాతో నాకు ఎటువంటి సంబంధం లేదు.. అల్లు శిరీష్ షాకింగ్ ట్వీట్..

Allu Sirish says Please do not add me in Aha Compliant
x

 "దయచేసి ఆహా కంప్లైంట్ లో నన్ను యాడ్ చేయొద్దు" అంటున్న అల్లు శిరీష్...

Highlights

Allu Sirish: థియేటర్లు మూత పడినప్పటినుంచి డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై క్రేజ్ బాగా పెరిగిపోయింది.

Allu Sirish: తెలుగు ప్రేక్షకులకు ఆహా ఓటీటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లు మూత పడినప్పటినుంచి డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ "ఆహా" అనే ఒక డిజిటల్ ప్లాట్ ఫామ్ లాంచ్ చేశారు. మొదట్లో అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ సెలబ్రిటీ టాక్ షోలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్ తో ఇప్పుడు ఆహా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళం, మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుండడంతో సబ్‌స్క్రైబర్లు బాగానే పెరిగారు. ఇక చిన్న సినిమాలను కూడా విడుదల చేస్తూ ఆహా మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. మొదట విజయ్ దేవరకొండ ఆహా ను ప్రమోట్ చేశారు.

ఆ తర్వాత అల్లు అర్జున్ ఆహా గురించి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అయితే తాజాగా ఇప్పుడు అల్లుశిరీష్ ఆహా గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "డియర్‌ ఆహా వీడియోస్‌ టీం… చాలా మంది నేను 'ఆహా' బిజినెస్‌ లో మెంబర్ ని అనుకొని ఈ యాప్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను పంచుకుంటూ నన్ను ట్యాగ్‌ చేస్తూ చేస్తున్నారు. దయచేసి వారి సమస్యలను పరిష్కరించండి'' అంటూ ట్వీట్‌ చేశాడు శిరీష్. దిల్ రాజు, మై హోమ్ ఫ్యామిలీ మ అధినేతలు ఇలా చాలామంది ఆహా లో పెట్టుబడులు పెట్టారు. నిజానికి అల్లు శిరీష్ చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఆప్ గురించి ఎటువంటి సమస్య వచ్చినా టెక్నికల్ టీం మాత్రమే దానిని సాల్వ్ చేయగలదు కానీ చేతిలో మాత్రం ఏమీ ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories