అల్లు శిరీష్‌ -అను ఇమ్మాన్యుయేల్ 'Prema కాదంట'..మరి ఇదేంటో!

PremaKadanta: సిక్స్‌ప్యాక్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన‌ అల్లు శిరీష్ వ‌రుసగా తన సినిమాకు సంబంధించి ప్రీ లుక్‌లు రిలీజ్‌ చేస్తూ జనాలను ఆకర్షించాడు.

Samba Siva Rao
Published on: 30 May 2021 2:24 PM IST
PremaKadanta Title and First Look Poster Released
X

  PremaKadanta First Look 

PremaKadanta: ఈ మధ్యే సిక్స్‌ప్యాక్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన‌ అల్లు శిరీష్ వ‌రుసగా తన సినిమాకు సంబంధించి ప్రీ లుక్‌లు రిలీజ్‌ చేస్తూ జనాలను ఆకర్షించాడు. మే 30 శిరీష్ పుట్టిన రోజు కావ‌డంతో త‌న సినిమాకు చెందిన‌ పురస్కరించుకుని చిత్రయూనిట్‌ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం "Prema కాదంట''. ఈ సినిమాలో అల్లు శీరీష్ కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈ "Prema కాదంట'' పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే.. అద్దం ముందు ఫొటోలు దిగుతున్న అను ఇమ్మాన్యుయేల్‌ మీద హీరో ముద్దుల వర్షం కురిపిస్తున్న లుక్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక అను, శిరీష్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని టైటిల్ లో వారికి మ‌ధ్య ప్రేమ లేద‌ని చెబుతున్నారా అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. అల్లు శిరీష్‌ ఒకేసారి ఈ రెండు ఫార్ములాలను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పెద్దగా రొమాన్స్‌ జోలికి పోని శిరీష్‌ ఈ సినిమాలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story