Allu Sirish: కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న అల్లు శిరీష్

Allu Sirish: మరొక సినిమా తో తన అదృష్టం పరీక్షించుకోబోతున్న అల్లు శిరీష్

Jyothi
Updated on: 21 Feb 2023 8:31 PM IST
Allu Sirish is Going to Come in front of the Audience with a New Movie
X

Allu Sirish: కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న అల్లు శిరీష్

Allu Sirish: అల్లు కుటుంబం నుండి అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈమధ్యనే "పుష్ప" సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయారు. మరోవైపు అల్లు అర్జున్ తమ్ముడిగా "గౌరవం" అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు శిరీష్. ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించిన శిరీష్ ఇప్పటి వరకు తనకంటూ సొంత మార్కెట్ ను మాత్రం అంతగా క్రియేట్ చేసుకోలేకపోయాడు.

హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ అండ వల్ల ఇప్పటికి కూడా హీరోగా నిలబడే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు. "కొత్తజంట" సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న శిరీష్ పరశురాం దర్శకత్వంలో చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక గత ఏడాది "ఊర్వశివో రాక్షశివో" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు అల్లు శిరీష్. విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా బాగుందని టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం అంత ఆశాజనకంగా లేవు. అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీ లలో మంచి రెస్పాన్స్ అందుకుంది.

తాజాగా ఇప్పుడు అల్లు శిరీష్ తన హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 లో మరోక సినిమా సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఓ కొత్త దర్శకుడితో అల్లు శిరీష్ ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయిపోయిందట. ప్రస్తుతం చిత్ర బృందం నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story