అరుదైన అవార్డు ని అందుకున్న అల్లు శిరీష్

Ruthvik
Published on: 30 April 2019 1:46 PM IST
అరుదైన అవార్డు ని అందుకున్న అల్లు శిరీష్
X

మెగా హీరో అల్లు శిరీష్ గౌరవం అనే చిత్రం తో పరిశ్రమ లో కి ఆడగు పెట్టారు. ఇప్పటికి ఒకటి రెండు హిట్లు సాధించిన ఈ నటుడు మలయాళం లో కూడా సినిమా చేశారు. ఇప్పుడు ఆయనకీ ఒక అరుదైన అవార్డు దక్కింది. ప్రస్తుతం ఫిలిం నగర్ లో వస్తున్న వార్తల ప్రకారం అల్లు శిరీష్ కి కొచ్చి లో ని 'లులు ఫాషన్ వీక్' 2019 ఎడిషన్ వారు 'క్రాస్ ఓవర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ని అందించనున్నారు.

ఈ విషయాన్ని శిరీష్ పీఆర్ టీమ్ సోషల్ మీడియా లో కన్ఫర్మ్ చేశారు. అల్లు శిరీష్ గత సంవత్సరం విడుదల అయినా 1971 అనే మలయాళ చిత్రం తో మోలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఈ సినిమా లో మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్లాల్ తో కలిసి నటించాడు. ఈ సినిమా లో అల్లు శిరీష్ నటన కి గాను ఈ అవార్డు ని అందించారు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఈ అవార్డు అందుకున్న నటుల్లో అల్లు శిరీష్ మొదటి వాడు. ఈ విషయమై అల్లు శిరీష్ చాలా సంతోషం గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఏబీసీడీ సినిమా ప్రచార పనుల్లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా మలయాళం లో వచ్చిన ఏబీసీడీ అనే సినిమా కి రీమేక్. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story