Allu Sirish: అల్లు శిరీష్ ని చెప్పుతో కొడతాను అన్న అల్లు అరవింద్..

Allu Sirish: శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత ఆస్థాయి హిట్టని అందుకోలేకపోయాడు అల్లు శిరీష్.

Arun Chilukuri
Updated on: 10 Nov 2022 8:00 PM IST
Allu Sirish Emotional Speech At Urvasivo Rakshasivo Movie
X

Allu Sirish: అల్లు శిరీష్ ని చెప్పుతో కొడతాను అన్న అల్లు అరవింద్..

Allu Sirish: శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత ఆస్థాయి హిట్టని అందుకోలేకపోయాడు అల్లు శిరీష్. ఇక వరుసగా కొన్ని ఫ్లాపులను అందుకున్న అల్లు శిరీష్ తాజాగా కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి తాజాగా "ఊర్వశివో రాక్షసివో" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రాకేష్ శశి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది.

అను ఇమ్మన్యుల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా మొదటి రోజు నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా షోకి వెళ్లిన అల్లు శిరీష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నావా అని అడగగా కేవలం మాస్ సినిమా చేస్తే తప్ప కమర్షియల్ సక్సెస్ ముద్ర రాదని చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్.

ఇక తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తన తండ్రి అల్లు అరవింద్ దగ్గర ఎప్పుడైనా తనులు తిన్నారా అని అడగగా పెద్దన్నయ్య వెంకటేష్ తర్వాత తనే నాన్న దగ్గర ఎక్కువ దెబ్బలు తిన్నానని ఒకానొక సమయంలో తనను చెప్పుతో కొడతానని అల్లు అరవింద్ భయపెట్టినట్లు కూడా చెప్పుకొచ్చాడు శిరీష్. "అప్పట్లో డబ్బు విలువ తెలిసేది కాదు. 21 ఏళ్లు రాగానే కారు కావాలని పట్టు పట్టాను. అప్పుడు మా నాన్న చెప్పు తీసుకొని కొడతాను అని తిట్టారు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తా కారు కావాలంటే కొనుక్కో అని అన్నారు. కానీ నేను సొంత కారు కొనడానికి మూడేళ్లు పట్టింది," అని గుర్తు చేసుకున్నారు శిరీష్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story