Allu Sirish: తమన్నా కోసం గెస్ట్‌గా వచ్చిన శిరీష్

Allu Sirish: ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ గా మారిన అల్లు శిరీష్

admin1
Updated on: 12 Aug 2021 2:05 PM IST
Allu Sirish attended as First Celebrity Guest to Tamannaah new Program
X

అల్లు శిరీష్ (ఫైల్ ఇమేజ్)

Allu Sirish: ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలు కూడా బుల్లితెరపై కనిపించేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవైపు లీడ్ పాత్రల్లో మెప్పిస్తూనే మరోవైపు టీవీ షోలకు హోస్ట్ గా మారిపోతున్నారు. ఇప్పటికే నాగార్జున, నాని, ఎన్టీఆర్, రానా వంటి స్టార్లు హోస్ట్ లుగా మారిపోగా తాజాగా ఈ జాబితా లో జాయిన్ అయిన సెలబ్రిటీ మిల్కీ బ్యూటీ తమన్నా. హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రామ్ ఇప్పుడు తెలుగు, తమిళ్ మరియు కన్నడ భాషల్లో కూడా మొదలు కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ కు మన తమన్నా భాటియా హోస్ట్ గా వ్యవహరించనుంది. దీనికి సంబంధించి ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ షోకు మొట్టమొదటి సెలబ్రిటీ గెస్ట్ గా అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ హాజరయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు శిరీష్. "తమన్నా తో మాస్టర్ చెఫ్ తెలుగు లో కనిపించనున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది" అని పోస్ట్ చేసిన శిరీష్ షూటింగ్ పూర్తి చేశానని, మాస్టర్ చెఫ్ తెలుగులో ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ కావడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇక మరోవైపు తమిళ వెర్షన్ కు టాలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కన్నడ వెర్షన్ సుదీప్ హోస్ట్ గా కనిపించనున్నారు.

admin1

admin1

Next Story