అల్లు అయాన్ నుండి క్యూట్ గిఫ్ట్ అందుకున్న అల్లు అర్జున్

* అల్లు అయాన్ నుండి క్యూట్ గిఫ్ట్ అందుకున్న అల్లు అర్జున్

Dhatripriya
Updated on: 6 Feb 2023 4:30 PM IST
Allu Ayan Gave An Unforgettable Gift To Allu Arjun
X

అల్లు అర్జున్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అయాన్

Allu Arjun: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "పుష్ప". 2021లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఇప్పుడు బన్నీకి ఈ సినిమా ని మరింత స్పెషల్ గా మార్చాడు.

సినిమాలో అల్లు అర్జున్ "పుష్ప" పాత్రలో నడిపిన లారీ బొమ్మని అల్లుఅర్జున్ బన్నీకి గిఫ్ట్ గా ఇచ్చాడు. "క్యూటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ మై స్వీటెస్ట్ సోల్ అయాన్ చిన్ని బాబు" అనే క్యాప్షన్ తో అల్లు అర్జున్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా అల్లు అయాన్ ఇచ్చిన ఆ లారీ బొమ్మను కూడా చూపించారు బన్నీ. ఇక తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సినిమాకి సీక్వెల్ అయిన "పుష్ప: ది రూల్" షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో త్వరలో విడుదల కి సిద్ధమవుతోంది. ఇక "పుష్ప" లాగానే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఇప్పటినుంచే చెబుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story