రామ్ చరణ్ ఫ్యాన్స్ కి జవాబు ఇచ్చిన అల్లు అర్జున్ టీం

* రామ్ చరణ్ కి వీడియో కాల్ చేసిన అల్లు అర్జున్

Dhatripriya
Published on: 30 March 2023 1:22 PM IST
Allu Arjuns Team Answered Ram Charans Fans
X

రామ్ చరణ్ ఫాన్స్ కి జవాబు ఇచ్చిన అల్లు అర్జున్ టీం

Ram Charan: ఈ మధ్యనే మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టినరోజు వేడుకలను చిరంజీవి ఇంట్లో సెలబ్రిటీల మధ్య భారీ స్థాయిలో జరుపుకున్నారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడ కనిపించలేదు. దీంతో మళ్లీ మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది అని కొన్ని పుకార్లు మొదలయ్యాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ రామ్ చరణ్ పుట్టినరోజుకి రాలేకపోయినప్పటికీ స్పెషల్ గా ఫోన్ చేసి విషెస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే దీని గురించి అల్లు అర్జున్ టీం క్లారిఫికేషన్ ఇచ్చింది.

షూటింగ్ కారణంగా అల్లు అర్జున్ వియత్నంలో ఉన్నారని అందుకే రామ్ చరణ్ పుట్టినరోజుకి రాలేకపోయారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రామ్ చరణ్ సోదరి కూడా వియత్నం లోనే ఉన్నారని అందుకే ఆమె కూడా రాలేకపోయారని తెలుస్తోంది. అంతేకాకుండా రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి అల్లు అర్జున్ వీడియో కాల్ చేసి చాలా సేపు మాట్లాడారని సమాచారం. మరోవైపు ఈ మధ్యనే అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో అభిమానులు అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు చెబుతూ ప్రశంసల వర్షం కురిపించారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ కి స్పెషల్ విషెస్ ను తెలియజేశారు. అల్లు కుటుంబం మరియు మెగా కుటుంబం మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎవరు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇలాంటి చిన్న చిన్న విషయాలపై అభిమానులు మళ్లీ గొడవలు పడుతున్నారని వాళ్లు బానే ఉన్నారు కాబట్టి అభిమానులు కూడా గొడవలు మానేస్తే బాగుంటుంది అని కొందరు చెబుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story