పుష్ప విషయంలో అల్లు అర్జున్ ఐడియా బ్యాక్ ఫైర్ అయిందా.. మూడు కోట్లు నష్టపోయిన..

Allu Arjuns Pushpa Ended In Russia
x

పుష్ప విషయంలో అల్లు అర్జున్ ఐడియా బ్యాక్ ఫైర్ అయిందా.. మూడు కోట్లు నష్టపోయిన..

Highlights

Pushpa: "ఆర్య", "ఆర్య 2" సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూడవ సినిమా "పుష్ప: ది రైజ్".

Pushpa: "ఆర్య", "ఆర్య 2" సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూడవ సినిమా "పుష్ప: ది రైజ్". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా అదిరిపోయే రికార్డులను సృష్టించింది. భారత దేశంలో మాత్రమే కాక ఓవర్సీస్ లో కూడా సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శక నిర్మాతలు డిసెంబర్ 8న ఈ సినిమాని రష్యాలో కూడా విడుదల చేశారు.

ఇక సినిమాపై బజ్ పెరగడానికి అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్ కూడా రష్యా వెళ్లి మరీ ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోషన్లు చేశారు. రష్యాలో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ రష్యాలో పుష్ప సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాని డబ్ చేయడానికి, ప్రమోషన్ల కోసం నిర్మాతలు మూడు కోట్లు ఖర్చుపెట్టారు. కానీ సినిమా అందులో సగం కలెక్షన్లను కూడా తిరిగి తీసుకురాలేకపోయింది. రష్యా ప్రేక్షకులు సినిమాని చూడడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. సినిమా విడుదల అయ్యి వారం రోజులు కూడా కాకుండానే ఆక్యుపెన్సి తక్కువగా ఉండటంతో థియేటర్ల నుంచి సినిమాని తీసేశారు.

దీంతో సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారికి మూడు కోట్ల నష్టం వాటిల్లింది. అయితే తాజా సమాచారం ప్రకారం అసలు సినిమాని రష్యాలో విడుదల చేయాలన్న ప్లాన్ ఇచ్చింది స్వయంగా అల్లు అర్జున్ అని తెలుస్తోంది. ఒకవేళ పుష్ప సినిమా రష్యాలో కూడా బాగా ఆడితే సినిమా రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" ని కూడా అక్కడ విడుదల చేయొచ్చని అప్పుడు సినిమా క్రేజ్ బాగా పెరుగుతుందని అల్లు అర్జున్ ఈ ఐడియా ఇచ్చారట. కానీ రష్యా విషయంలో అల్లు అర్జున్ ప్లాన్ బ్యాక్ ఫైర్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories