Pushpa 2 runtime: పుష్ప టు ఇక్కడ.. తగ్గేదేలా..! రెండు గంటలనుకుంటిరా..అచ్చరాల మూడు గంటలా 20 నిమిషాల 38 సెకండ్లు..

Pushpa 2 runtime
x

Pushpa 2 runtime: పుష్ప టు ఇక్కడ.. తగ్గేదేలా..! రెండు గంటలనుకుంటిరా..అచ్చరాల మూడు గంటలా 20 నిమిషాల 38 సెకండ్లు..

Highlights

Pushpa 2 runtime: రెండు గంటలనుకుంటిరా.. మూడుగంటల పై మాటే.. అచ్చరాల మూడు గంటలా మూడు గంటలా 20 నిముషాల 38 సెకండ్లు .. పుష్ప టు ఇక్కడ..తగ్గేదేలా..!

Pushpa 2 runtime: రెండు గంటలనుకుంటిరా.. మూడుగంటల పై మాటే.. అచ్చరాల మూడు గంటలా మూడు గంటలా 20 నిముషాల 38 సెకండ్లు .. పుష్ప టు ఇక్కడ..తగ్గేదేలా..!

అవును..పాన్ ఇండియా సినిమాగా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప టు సినిమా నిడివి మూడు గంటలా 20 నిముషాల 38 సెకండ్లు. పుష్ప లాగానే పుష్ప 2 కూడా సూపర్ డూపర్ హిట్టయితే ఆ సినిమా నిడివి టాలీవుడ్ లో మరో ట్రెండ్ సెట్టర్ గా మారనుంది.

పుష్ప 2 నిడివి తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికే మూడోస్థానాన్ని ఆక్రమించింది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన దాన వీర శూర కర్ణ సినిమా నిడివి 3 గంటలా 26 నిమిషాలు.. ఆ తరువాత ఎన్టీఆరే నటించిన లవకుశ సినిమా నిడివి 3 గంటలా 28 నిముషాలు..ఆ రెండు చిత్రాల తరువాత భారీ నిడివి ఉన్న చిత్రం పుష్ప-2 కావటం విశేషం.

ఇప్పటివరకు దాన వీర శూర కర్ణ, లవకుశల తరువాత భారీ నిడివి చిత్రాల రికార్డును 3 గంటలా 18 నిముషాలతో వచ్చిన పాండవ వనవాసం, 3 గంటలా 15 నిముషాల నిడివితో వచ్చిన పాతాళ భైరవి, 3 గంటలా 7 నిముషాలుండే అల్లూరి సీతారామరాజు, 3 గంటలా 7 నిముషాల నిడివితో వచ్చిన నిజం, 3 గంటల ఆరు నిముషాల నిడివి గల ఆర్ ఆర్ ఆర్, 3 గంటలా 6 నిముషాలున్న మరో సినిమా అర్జున్ రెడ్డి, 3 గంటలా 4 నిముషాల నిడివితో ఉన్న మాయా బజార్ చిత్రాలు సొంతం చేసుకున్నాయి. పుష్ప 2 తో అవన్నీ వెనక్కి జరిగి పుష్ప టును మూడో స్థానంలో నిలబెడుతున్నాయి.

దాన వీర శూర కర్ణ, లవకుశలు పౌరాణిక చిత్రాలు.. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన సోషల్ సినిమాల చరిత్రలో పుష్ప టు నిడివే టాప్ .. పౌరాణిక, జానపద చిత్రాల ఒరవడి తగ్గే కొద్దీ సమకాలీన సామాజికాంశాలతో వచ్చే సోషల్ పిక్చర్స్ కు ఆదరణ పెరుగుతూ వచ్చింది.

సినిమాల నిడివి విషయంలోనూ ప్రేక్షకుల అభిరుచి మారుతూ వచ్చింది. రెండున్నర గంటల నుంచి రెండు గంటల 45 నిముషాల వరకు ఉండే సినిమాలు ఇప్పుడు రెండుగంటలకూ, ఆ పైన మరో 15 నిముషాలు..సగటున రెండు గంటలా పదిహేను నిముషాల నిడివి ఉన్న సినిమాలే ఎక్కువ.

రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాలంటే ప్రేక్షకులు బోర్ గా ఫీలయ్యే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది 3 గంటలా 20 నిముషాల నిడివితో సినిమా తీయటం పుష్ప 2 మేకర్స్ సాహసమనే చెప్పాలి. ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేసే ఉత్కంఠ సన్నివేశాలతో పుష్ప 2 రూపుదిద్దుకుందన్న కాన్ఫిడాన్సే ఈ భారీ నిడివికి కారణమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పుష్ప టు పుష్ప 1 రేంజ్ లో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తే సుకుమార్, బన్నీలు భారీ నిడివి సినిమాల ట్రెండ్ ను సెట్ చేసినట్టే .. ఆల్ ది బెస్ట్

Show Full Article
Print Article
Next Story
More Stories