Pushpa 2: రియల్ టైగర్‌తో పుష్పరాజ్ ఫైట్..?

Pushpa 2: రియల్ టైగర్‌తో పుష్పరాజ్ ఫైట్..?

Arun Chilukuri
Updated on: 2 Nov 2022 8:31 PM IST
Allu Arjun Will Fight With Tiger in Pushpa The Rule ?
X

Pushpa 2: రియల్ టైగర్‌తో పుష్పరాజ్ ఫైట్..?

Pushpa 2: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన "పుష్ప: ది రూల్" బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఇక ఏదైనా సినిమా హిట్ అవ్వడం వెనుక కారణాల్లో సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా వరకూ సన్నివేశాలలో సీజీని వాడుతున్నారు. కానీ సుకుమార్ మాత్రం అందరి దర్శకుల్లాగా కాదు. ఎప్పుడూ రియాలిటీ కి పెద్దపీట వేస్తూ ఉంటారు. పులితో సన్నివేశమైన సరే నిజంగా పులినే రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అదే చేయబోతున్నారట. సినిమాల్లోని కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ జరగబోతోంది. అక్కడ అడవుల్లో ఒక ఫైటింగ్ సీను డిజైన్ చేశారు. విదేశాల్లో జంతువులు కొంత ఫ్రెండ్లీ ఉంటాయి. అలా బాగా ట్రైనింగ్ అయిన ఒక పులి తో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story